VZM: ఎస్ కోట స్థానిక శ్రీనివాస కాలనీకి చెందిన ముమ్మన రమణ (50) మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో శనివారం తన ఇంట్లో ఉన్న హార్పిక్ తాగి సృహ కోల్పోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ నారాయణమూర్తి తెలిపారు.