KRNL: కృష్ణగిరి మండలం సంగాల గ్రామానికి చెందిన 19 ఏళ్ల కురువ సింహాద్రి హైదరాబాద్లో పని కోసం వెళ్లి మూడు నెలలుగా ఉంటున్నాడు. కొన్ని రోజులుగా అతని ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో ఆందోళన చెందిన తల్లి కురువ సువర్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం ఎస్సై కృష్ణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.