విజయనగరం: జిల్లా మీదుగా నడిచే అమృత్ భారత్ రైలు రెగ్యులర్ సర్వీసులు ప్రారంభమయ్యాయని రైల్వే శాఖ వెల్లడించింది. ఈ సందర్భంగా బ్రహ్మపూర్-సూరత్(ఉద్నా)-బ్రహ్మపూర్( రైలు నం. 19021/22) అమృత్ భారత్ వీక్లీ ఎక్స్ప్రెస్ రైలు బ్రహ్మపూర్ నుంచి ప్రతి సోమవారం, సూరత్ నుంచి ప్రతి ఆదివారం ప్రారంభమవుతుందని వెల్లడించింది. ఇది జిల్లాలోని విజయనగరం రైల్వే స్టేషన్లో ఆగనుంది.