AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టికెట్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఆక్టోపస్ భవనం వరకు భక్తుల క్యూ లైన్ ఉంది. శ్రీవారిని నిన్న 83,380 మంది దర్శించుకోగా, 32,275 మంది తలనీలాలు సర్పించుకున్నారు. హుండీ ద్వారా రూ.3.71 కోట్ల ఆదాయం వచ్చింది.