SRCL: మత సామరస్యానికి మన తెలంగాణ పెట్టింది పేరు. అందులోనూ హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు తదితర మతాల వారు కలిసిమెలిసి వేడుకల్లో పాలుపంచుకోవడం చూస్తూ ఉంటాం. తాజాగా వీర్నపల్లి మండలంలో మత సామరస్యం వెల్లివిరిసింది. దుర్గామాత నిమజ్జనాల వేళ అమ్మవారి లడ్డూను శనివారం వేలం వేయగా హైమద్ హుస్సేన్ అనే ముస్లిం సోదరుడు దక్కించుకున్నారు.