వాహనాదారులు ట్రాఫిక్ నిబంధనల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఇకపై మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇక నుంచి 45 రోజుల్లోగా కట్టేయాలి లేదా మీ తప్పు లేకుంటే అప్పీల్ చేసుకోవాలి. అంతకుమించి ఆలస్యం చేస్తే.. మీ బండిని అధికారులు స్వాధీనం చేసుకోవచ్చు. ఐదుకు మించి చలాన్లు ఉంటే ఏకంగా లైసెన్స్ రద్దు కావచ్చు. సెంట్రల్ వెహికిల్స్ రూల్స్-1989లో కేంద్ర రవాణాశాఖ ఈ కీలక సవరణలను ప్రతిపాదించింది.