KMM: తల్లాడ మండలం నారాయణపురం గ్రామంలో ఘనంగా అమ్మవారి ఊరేగింపు శనివారం జరిగింది. భారీ అమ్మవారి విగ్రహంతో రెడ్డెం వీర మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య హాజరై అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. ఇంత ఘనంగా ఉత్సవాలు జరుపుతున్న వారిని ఎమ్మెల్యే అభినందించారు.