ATP: జిల్లాలో చికెన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. గత రెండు రోజులు క్రితం కేజీ చికెన్ ధర రూ.150 ఉండగా ఆదివారం కేజీ పై రూ. 20 పెరిగి రూ.200కు చేరినట్లు చికెన్ షాప్ నిర్వాహకులు తెలిపారు. మటన్ ధరలో ఎలాంటి మార్పు లేకుండా కేజీ రూ.750 ఉన్నట్లు తెలిపారు. చికెన్ ధరలు పెరగడంతో విక్రయదారులు కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు.