ATP: అనంతపురం పట్టణంలోని ఐసీడీఎస్ శిశు గృహంలో ఆకలితో పసికందు మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ఆనంద్ స్పందించారు. ఆయాల మధ్య వివాదంతోనే పసికందు మృతి చెందినట్లు వార్తలు రావడంతో ఘటనపై విచారణకు ఆదేశించారు. త్వరితగతిన నివేదిక ఇవ్వాలని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ నాగమణికి సూచించారు.