ATP: ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో ఈ పంట నమోదు గడువును ఈ నెల 25 వరకు రాష్ట్ర వ్యవసాయశాఖ అధికారులు పొడిగించారు. సెప్టెంబరు చివరి తేదీ వరకు గడువు ఉండగా నమోదు మందకొడిగా సాగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో 19.01 లక్షల ఎకరాల్లో నమోదు లక్ష్యం ఉండగా ఇప్పటి వరకు 8 లక్షల ఎకరాల్లో (42%) మాత్రమే పూర్తి చేశారు.