NLR: అల్లూరు మండలంలోని లబ్బి పాలెం అంగన్వాడీ కేంద్రంలో శనివారం పౌష్టికాహారంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సూపర్వైజర్ సౌజన్య మాట్లాడుతూ.. ప్రతిరోజు మంచి పౌష్టికాహారంతో కూడిన ఆకుకూరలు, కాయగూరలు తినాలన్నారు. గర్భవతులకు బాలింతలకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.