W.G: తాడేపల్లిగూడెం మున్సిపాల్టీలో పారిశుద్ధ్య కార్మికుడిగా ఔట్ సోర్సింగ్ విధానంలో విధులు నిర్వహిస్తున్న పూనకం మునియ్య కలుపు మందు తాగి శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వార్డు శానిటరీ సెక్రటరీ, శానిటరీ ఇన్స్పెక్టర్ తనను వేధిస్తున్నారని వారి వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని తెలిపాడు. ప్రస్తుతం మునియ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.