W.G: పాలకొల్లు నియోజకవర్గంలో పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన 29 మందికి వైద్య సహాయం నిమిత్తం మంజూరైన రూ.23 లక్షల రూపాయల సీఎం సహాయనిధి చెక్కులను శనివారం మంత్రి నిమ్మల రామానాయుడు తన కార్యాలయంలో అందజేశారు. ఏడాది పాలనలో నియోజకవర్గ మొత్తం మీద వైద్య ఖర్చుల సాయం కింద రూ.8 కోట్లు వరకు అందజేశామని, చంద్రబాబు సమర్థ పాలనకు నిదర్శనమే ఈ సాయం అన్నారు.