AKP: అర్హులైన వారందరికీ పింఛన్లు, రేషన్ కార్డులు, గృహాలు మంజూరు చేస్తామని అనకాపల్లి నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త పీలా గోవిందు హామీ ఇచ్చారు. శుక్రవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తుందన్నారు.