కృష్ణా: తగ్గిన జీఎస్టీకి అనుగుణంగా తగ్గిన ధరల పట్టికలు దుకాణాల ముందు ఖచ్చితంగా నిర్వహించాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ స్పష్టం చేశారు. నాగాయలంకలో ‘సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్’ ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలపై మార్కెట్ యార్డ్ ఆవరణలో అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రభుత్వాలు ప్రజల జీవన వ్యయం, రైతుల వ్యవసాయ ఖర్చులు తగ్గించేందుకు జీఎస్టీని తగ్గించిందన్నారు.