WGL: ఉమ్మడి జిల్లాలో దసరా పండుగ సందర్భంగా ఈత కల్లుకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. తాటి కల్లు సీజన్ కాకపోవడంతో ప్రజలు ఈత కల్లు వైపు మొగ్గుచూపుతున్నారు. వర్షాల కారణంగా ఈత కల్లు ఇన్నాళ్లు తక్కువగా పారింది. గత మూడు రోజులుగా ఎండలు రావడంతో కల్లు కొద్దిగా వస్తోంది. పట్టణాల నుంచి గ్రామాలకు వచ్చిన వారు ఈత వనాల వద్ద బారులు తీరడంతో డిమాండ్ గణనీయంగా పెరిగింది.