NLG: మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాంరెడ్డి దామోదర్ రెడ్డి పార్ధీవదేహానికి జూబ్లీహిల్స్‌లోని వారి నివాసంలో శుక్రవారం శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.