SDPT: దినసరి కూలీ కుటుంబానికి చెందిన ప్రాంజల్ ఉన్నత స్థానానికి ఎగబాకింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్ద గుండవెల్లికి చెందిన దొడ్ల ప్రాంజల్ మహిళల భారత టీ20 క్రికెట్ జట్టుకు ఎంపికైంది. దీంతో జిల్లా ఖ్యాతి దేశవ్యాప్తంగా పెరిగింది. ఈ సందర్భంగా రేణుక ఎల్లమ్మ దేవాలయం కమిటీ ఛైర్మన్ మహేష్ ఆమెను ఘనంగా సన్మానించారు.