NGKL: బిజినేపల్లి మండల పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. ఎరన్నతండాకు చెందిన ఇస్లావత్ సురేష్ (22) పని నిమిత్తం తన గ్రామం నుంచి వనపర్తి వైపు వెళ్తున్నాడు. గణపురం మండలం షాపూర్ సమీపంలో తన వాహనం చెట్టును ఢీకొట్టింది. దీంతో సురేష్ అక్కడికక్కడే మరణించినట్లు స్థానికులు తెలిపారు.