MDK: మెదక్ నుంచి మక్త భూపతిపూర్ తాత్కాలిక బ్రిడ్జి రోడ్డు మరమ్మతు పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. గ్రామంలో జరుగుతున్న మహిళా శక్తి భవన నిర్మాణ పనులను పరిశీలించారు. భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. దీంతో మక్త భూపతిపూర్ గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.