ADB: స్థానిక ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఆదిలాబాద్ MP నగేశ్ పేర్కొన్నారు. గుడిహత్నూర్ మండల కేంద్రానికి చెందిన పలువురు బీజేపీ నాయకులు MP నగేశ్‌ను శుక్రవారం పట్టణంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎంపీ నగేష్ సూచించారు. నాయకులు కేశవ్, వామన్ పటేల్, సుధాకర్, తదితరులున్నారు.