చిత్తూరు: గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.యం. థామస్ రేపటి పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రంలో ఉదయం 10:00 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రధాన కార్యక్రమంలో పాల్గొంటారని కార్యాలయం తెలిపింది.