W.G: విజయవాడలో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, ఆమె భర్త వెంకట దత్తసాయి, కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే రాధాకృష్ణ శుక్రవారం కలిశారు. సింధు మావయ్య వెంకటేశ్వరరావు తనకు, తన కుటుంబానికి మంచి మిత్రులని ఎమ్మెల్యే తెలిపారు. యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న సింధు భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించి దేశానికి గర్వకారణమవుతారని ఆకాంక్షించారు.