SRCL: వేములవాడలో నూతన బార్ అసోసియేషన్ కార్యవర్గం సివిల్ జడ్జి ప్రవీణ్నను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. అనంతరం జడ్జికి నూతన కార్యవర్గం దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుడిసె సదానందం, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు జనార్ధన్, సత్యనారాయణ, దేవేందర్, అనిల్ కుమార్, సుధాకర్ పాల్గొన్నారు.