AKP: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాలల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు జిల్లా బాలల పరిరక్షణ కమిటీ సభ్యుడు లోవరాజు తెలిపారు. కోటవురట్ల మండలం బీకే పల్లిలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బాలల రక్షణ, హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించారు. బాల్యంలో ఎదుర్కొనే సమస్యల నుంచి ఏ విధంగా బయటపడాలో వివరించారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్ధాలను తెలియజేశారు.