KMM: నేలకొండపల్లిలో దసరా సందర్భంగా చివరి రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి దోపు సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారికి ప్రాబోధిక, పూర్ణాహుతి కార్యక్రమాలు జరిపి అనంతరం స్వామివారి ఊరేగింపు కార్యక్రమంలో భక్తులు పాల్గొని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్ కనుమర్లపూడి రమేష్, ఈవో శ్రీకాంత్, గంగపుత్ర సంఘం అధ్యక్షుడు మైసా శంకర్ పాల్గొన్నారు.