MDK: చేగుంట మండలం ఇబ్రహీంపూర్ శివారులోని పౌల్ట్రీలో పనిచేస్తున్న ఈశ్వరి (33) గురువారం రాత్రి అనుమానస్పదంగా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఏపీలోని అనంతపురం జిల్లా కొత్తకోటకు చెందిన నాగార్జున, ఈశ్వరి దంపతులు కొన్నేళ్లుగా పౌల్ట్రీలో పనిచేస్తున్నారు. రాత్రి అనుమానస్పదంగా ఈశ్వరి మృతి చెందడంతో భర్త హత్య చేసినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.