అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా 5 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసింది. ధ్రువ్ జురెల్ (125), రవీంద్ర జడేజా (104*) సెంచరీలతో చెలరేగారు. దీంతో భారత్ 286 పరుగుల ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం క్రీజ్‌లో జడేజా (104*), వాషింగ్టన్ సుందర్ (9*) ఉన్నారు.