ప్రపంచ వాతావరణ సంస్థ ఆదేశాల ప్రకారం హిందూ మహాసముద్రం తీరప్రాంతంగా కలిగిన 13 దేశాలు తుపాను పేర్లను నిర్ణయిస్తాయి. కొన్ని తుపానుల ప్రభావం వారం కన్నా ఎక్కువ రోజులు ఉంటుంది. అదే సమయంలో మరో తుపాను వస్తే ఎలా అని ఆలోచించి వాటికి పేర్లు పెట్టడం ప్రారంభించారు. ఈసారి ‘శక్తి’ పేరును శ్రీలంక పెట్టింది. ఈ పేర్లు వీలయినంత చిన్నగా.. సులభంగా పలికే విధంగా ఉండాలనే నిబంధన ఉంది.