NLG: ఓపెన్ టెన్త్, ఇంటర్లో ప్రవేశాలకు ఈనెల 6 వరకు గడువు ఉందని గుర్రంపోడు MEO యాదగిరి తెలిపారు. ఈ ఏడాది నుంచి మండల కేంద్రంలోని ZP ఉన్నత పాఠశాలలో స్టడీ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వివిధ కారణాల వల్ల మధ్యలో చదువు మానేసిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇవాళ మండలంలో ఓపెన్ స్కూల్ అడ్మిషన్లపై అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.