ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఆపరేషన్ సింధూర్ 2.O ఉండే అవకాశం ఉందన్నారు. పాక్ లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయాలని అన్నారు. ప్రపంచపటంలో ఉండాలనుకుంటే పాక్ సీమాంత ఉగ్రవాదాన్ని ఆపి తీరాల్సిందేనని తేల్చి చెప్పారు. లేదంటే పాకిస్తాన్ను భూగోళంలో లేకుండా చేస్తామని హెచ్చరించారు. అందుకు భారత సైన్యం సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.