అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో రవీంద్ర జడేజా సెంచరీతో అదరగొట్టాడు. 168 బంతుల్లో శతకం పూర్తి చేశాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 125.3 ఓవర్లకు 437/5గా ఉంది. దీంతో టీమిండియా 275 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు ధ్రువ్ జురెల్ 125 పరుగుల వద్ద ఔట్ కావడంతో వాషింగ్టన్ సుందర్ (4*) క్రీజ్‌లోకి వచ్చాడు.