కృష్ణా: గుడ్లవల్లేరు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద జీఎస్టీ 2.0లో భాగంగా రైతులకు అవగాహన కార్యక్రమం శుక్రవారం చేపట్టారు. రైతులకు వ్యవసాయ పరికరాలపై 28% జీఎస్టీ నుండి 18%కు తగ్గించబడిన విషయాన్ని వివరంగా తెలియజేశారు. దీంతో రైతులు అవసరమైన పరికరాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి, లాభం పొందాలని అధికారులు సూచించారు. డిప్యూటీ కమిషనర్ సునీత, ఎంపీడీవో పాల్గొన్నారు.