SRPT: సూర్యాపేట జిల్లాలో మద్యం దుకాణాలకు టెండర్లు వేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు. 99 మద్యం దుకాణాలకు గత నెల 26 నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. అనూహ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన రావడంతో,ప్రభుత్వం ఆశించిన మేర దరఖాస్తులు రావడం లేదు. నేటి వరకు కోదాడలో ఒక్క దరఖాస్తే వచ్చింది. ఈనెల 18 దరఖాస్తులకు చివరి తేదీ.