ప్రకాశం: జీఎస్టీ తగ్గింపు ధరలపై గ్రామాల్లో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని తహసీల్దార్ వాసుదేవరావు అన్నారు. శుక్రవారం పామూరు తహసీల్దార్ కార్యాలయంలో జీఎస్టీ, నిత్యావసర సరకుల ధరల తగ్గింపుపై సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ..పన్ను తగ్గింపుతో పేదలకు ఎంతో మేలు కలగనుందని తెలిపారు. గ్రామాలలో ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు