సత్యసాయి: దేశ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో జీఎస్టీ ధరలు ఒకేసారి 12% నుంచి 5% వరకు తగ్గించడంపై ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం ముదిగుబ్బ మండలంలోని ముక్తాపురంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులకు తోడ్పాటును అందించే విధంగా నరేంద్ర మోదీ తీవ్రంగా కృషి చేస్తున్నారని వివరించారు.