ప్రకాశం: వెదురుకుప్పంలో అంబేడ్కర్ విగ్రహానికి మంటలు అంటుకున్న ఘటనపై విచారణకు ఆదేశించామని మంత్రి డోల వీరాంజనేయస్వామి చెప్పారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్ ఇప్పటికే ఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. ఈ విషయంలో విద్వేషాలు రెచ్చగొట్టొద్దు అని పేర్కొన్నారు. అంబేడ్కర్ విగ్రహాన్ని అవమానించిన వారిని వదిలేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.