HYDలోని జియాగూడ మేకల మండి ఆధునికరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీకి అనుమతులు ఇచ్చింది. త్వరలోనే దీని ఆధునికరణ పనులు నిర్వహించనున్నారు. సుమారుగా రోజూ 6,000 మేకలను వధించే సామర్థ్యంతో నూతన భవన నిర్మాణాలు చేపట్టాల్సి ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. చెంగిచెర్లలోని కబేలాను ఆధునికరించాలని అక్కడికి వెళుతున్న పలువురు వ్యాపారులు ప్రభుత్వాన్ని కోరారు.