కరూర్ తొక్కిసలాట ఘటనపై మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. ఘటన తర్వాత టీవీకే నేతలు ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించింది. ఎందుకు బాధితులను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. విజయ్ వాహనాన్ని ఎందుకు సీజ్ చేయాలేదని ప్రశ్నించింది. ఈ మేరకు టీవీకే నేతల ముందస్తు బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేసింది.