E.G: నల్లజర్ల మండలం ముసుళ్లగుంటయ శివారు పొలాల్లో గుర్తు తెలియని వ్యక్తులు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి అందులో ఉన్న రాగి తీగలను చోరీ చేశారు. శుక్రవారం పొలాల్లోకి వెళ్లిన రైతులు పాకలపాటి వెంకటేశ్వరరావు, పాలగాని రాంబాబులు ఈ ఘటనను గమనించి విషయాన్ని సర్పంచ్ నందమూరి శారదాదేవి దృష్టి తీసుకెళ్లారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.