SRD: కంగ్టి నుంచి తుల్జాపూర్ మహా క్షేత్రానికి యువకులు పాదయాత్రగా శనివారం తెల్లవారుజామున బయలుదేరి వెళ్లారు. శ్రీ భ్రమరాంబ దేవి కమిటీ ఆధ్వర్యంలో నవరాత్రులు పూర్తి చేసి అమ్మవారిని శుక్రవారం రాత్రి నిమజ్జనం చేశారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి 130 మంది యువకులు కాలినడకన వెళ్లారు. 200 కిలోమీటర్లు, 4 రోజుల పాదయాత్ర చేస్తామన్నారు.