WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని మాదన్నపేట నుంచి నల్లబెల్లికి వెళ్లే ప్రధాన రహదారి గుంతలతో అధ్వానంగా మారింది. చంద్రయ్యపల్లి, రాంనగర్ మధ్య వారధి వద్ద నీరు నిలిచి రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. బురదమయమైన రోడ్లను చూసి స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించి రహదారిని బాగుచేయాలని అధికారులను కోరుతున్నారు.