PDPL: మంథని మండలంలో గుర్తు తెలియని జంతువు దాడిలో గాజులపల్లె గ్రామానికి చెందిన గంగుల కనకయ్య అనే గొర్రెల కాపరి 9 గొర్రె పిల్లలను కోల్పోయాడు. తన 50 గొర్రెల మందతో కుటుంబాన్ని పోషించుకుంటున్న కనకయ్య, పిల్లలు పెద్దయ్యాక అమ్ముకుని జీవనం సాగించేవాడు. ఈ దాడితో తీవ్ర నష్టపోయానని.. ప్రభుత్వం ఆదుకుని నష్టపరిహారం అందించాలని కోరుతున్నాడు.