VKB: స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఎన్నికల నిబంధనలను పాటించాలని కుల్కచర్ల MPDO రామకృష్ణ తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో రాజకీయ పార్టీలతో స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పోటీ చేసే అభ్యర్థులతో పాటు పలు రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలన్నారు.