తమిళ హీరో విష్ణు విశాల్ ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఆర్యన్’. ఈ నెల 31న థియేటర్లలో విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి శ్రేష్ట్ మూవీస్ ద్వారా భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఇక దర్శకుడు ప్రవీణ్ తెరకెక్కించిన ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, వాణి భోజన్ కథానాయికలుగా నటించారు.