ADB: ఆదివాసీల హక్కుల సాధనే లక్ష్యంగా ప్రతి ఒక్కరు ఉద్యమించాలని తెలంగాణ మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు మల్యాల మనోజ్ కుమార్ పేర్కొన్నారు. ఆదివాసి గిరిజన కోలం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన కొడప సోనేరావ్ పట్టణంలోని అంబేద్కర్ భవన్లో దళిత సంఘాల ఆధ్వర్యంలో శనివారం సత్కరించారు. ఆదివాసీల సమస్యల పరిష్కారానికి ఆయన చేసిన కృషిని అభినందించారు.