ASR: ఈ నెల 6,7వ తేదీల్లో అరకులో జరిగే సీఐటీయూ అల్లూరి జిల్లా రెండవ మహాసభ విజయవంతం చేయాలని అన్ని రంగాల కార్మికులకు సీఐటీయూ అరకు మండల కన్వీనర్ భగత్ రాం, జిల్లా ఉపాధ్యక్షుడు పోతురాజు కోరారు. ఈమేరకు శనివారం అరకులో మీడియాతో మాట్లాడుతూ.. ముందుగా ఈనెల 6వ తేదీన భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ మహా సభల్లో, కార్మికుల సమస్యలపై చర్చించడం జరుగుతుందన్నారు.