విజయనగరం, మహారాణిపేటలో ఉన్న బాల సదన్ చిన్న పిల్లల వసతి గృహాన్ని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఏ. కృష్ణ ప్రసాద్ శనివారం ఆకస్మికంగా సందర్శించారు. హోమ్ యొక్క గదులు, మరుగుదొడ్లు పరిశీలించారు. ఎప్పటికప్పుడు వాటిని శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలని హితవు పలికారు. అనంతరం డైనింగ్ హాల్‌ను, వంట గదులను పరిశీలించారు.