TPT: అంబేద్కర్ విగ్రహాన్ని దహనం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి జనమాల గురవయ్య డిమాండ్ చేశారు. శ్రీకాళహస్తిలో ఆయన మాట్లాడుతూ.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని దహనం చేయడం అత్యంత సిగ్గుచేటు అని అన్నారు. అంబేద్కర్ కేవలం అణిచివేతకు గురైన వర్గాల నాయకుడు మాత్రమే కాదు భారత రాజ్యాంగ నిర్మాత అని గుర్తు చేశారు.