SKLM: ఆమదాలవలస మండలం బొడ్డేపల్లి గ్రామం వద్ద ఉన్న అండర్ పాస్లో ఇటీవల కురిసిన వర్షాలకు నీరు చేరింది. దీంతో అటుగా ప్రయాణించిన ఏపీఎస్ఆర్టీసీ బస్సు నీట మునగడంతో మురాయించింది. దీంతో ప్రయాణికులు కాస్త ఇబ్బందులు పడ్డారు. అండర్ పాస్లో చేరిన నీరు బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో ఈ తరహా ఇబ్బందులు తలెత్తుతున్నాయని స్థానిక ప్రజలు అంటున్నారు.